క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టంతో ఒడిషా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనాకు అడ్డుక‌ట్ట వేసేందుకు లాక్ డౌన్ ను మ‌రి కొంత కాలం క‌ఠినంగా అమ‌లు చేయ‌డమే ఒక్క‌టే స‌రైన ప‌రిష్కార‌మ‌ని అక్క‌డ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈనేప‌థ్యంలోనే  దేశ‌వ్యాప్తంగా ఈనెల 14 వ‌ర‌కు లాక్‌డౌన్ అమలు కానుండ‌గా, దానిని ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగిస్తూ ఒడిశా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

క‌రోనా కేసుల‌ను త‌గ్గించేందుకు ఇందుకు మించిన మార్గంలేద‌ని అక్క‌డ ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో లాక్‌డౌన్ ను పొడిగించిన మొద‌టి రాష్ట్రంగా ఒడిషా నిలిచింది.  ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. ఇందులో 39 కేసులు యాక్టివ్‌లో ఉండ‌గా, ఇద్ద‌రు ద‌వాఖాన‌ల నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. క‌రోనా వైర‌స్ భారిన ప‌డి ఒక్క‌రు మ‌ర‌ణించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: