ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముస్లింల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు.  ముస్లింలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని  అ ధికారికంగా ప్రకటించారు. ముస్లిం మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల పట్ల తనకు అపార గౌరవముందని, తాను మాట్లాడిన మాటలను బేషరతుగా వాపస్ తీసుకుంటున్నానని ప్రకటించారు.

 

‘‘ఐసోలేషన్‌కు తీసుకెళ్లిన ముస్లింలు వైద్యులకు సహకరించడం లేదని, ఇప్పటికైనా వారు సహకరించాలి’  అని నారాయణస్వామి  సూచించిన విష‌యం తెలిసిందే. అంతేగాక  ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వ్యాప్తి చేసినట్లు అనిపిస్తోందని, దీనికి సంబంధించి కూడా వీడియోలు వచ్చాయని శనివారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించిన విషయం విధిత‌మే. 

 

తన మాటలు ముస్లింలకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం వర్గాలను కించపరుస్తూ తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలో వాస్తం లేదని కొట్టిపారేశారు. అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని తాను ప్రార్థిస్తున్నానని నారాయణ స్వామి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: