లాక్‌డౌన్ పొడిగింపుపై స‌స్పెన్స్ తొలిగిపోయింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌ను మే 3 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. క‌రోనాపై యుద్ధంలో భారత్ అద్భుతంగా పోరాడుతుంద‌న్న మోడీ, మ‌రో 19 రోజులు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అయితే లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు చేసిన ప్రసంగం వినేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీలు, రేడియోలకు అతుక్కుపోయారు.

 

 ప్రధాని మోడీ చేసే కీలక ప్రకటన కోసం కోట్లాది మంది ప్రజలు ఉదయం నుంచే ఆసక్తిగా ఎదురు చూశారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో మొదట అంబేద్కర్ గురించి ప్రస్థావించారు. ప్రధాని మోడీ ముఖానికి ఎరుపు రంగు టవల్ చుట్టుకొని వచ్చి ప్రజలకు అభివందనం చేసి ప్ర సంగాన్ని  ప్రారంభించారు. దేశంలో ఒక్క కరోనా రోగి లేనప్పుడు కూడా కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించడం ప్రా రంభించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: