కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి ఆంధ్ర ప్రదేశ్  లో పెరుగుతూనే ఉన్నాయి. విజయవాడ లోని రాణిగారి తోట ప్రాంతాల్లో ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ అని తేలింది . దీనితో రాణిగారి తోట ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రాణిగంజ్ లో సదరు వ్యక్తి టిఫిన్ బండి నడిపేవాడని ప్రాథమిక నిర్ధారణ లో తెలిసింది.ఇంతకుముందే రాణిగారి తోటలో ఓ పానీపూరి వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చింది . విశేషం ఏమిటంటే పాజిటివ్ వచ్చిన ఇద్దరుకూడా స్నేహితులు అని తెలిసింది. దీనితో రాణిగారి తోట ప్రాంతంలో కరోనా అలజడి రేగింది. పానీపూరి బండి వ్యక్తి మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

 

గుంటూరులోనిన్న 6 గంటల నుండి ఇప్పటి వరకు 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . అయితే గుంటూరులో ఇప్పటివరకు 109 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద గడచినా 16 గంటల్లో 35 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 16 కేసులు గుంటూరునుండి ఉండడం విశేషం. కృష్ణ మరియు కర్నూలో చెరో 8 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 2 , నెల్లూరు లో 1 కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు 450 ఆక్టివ్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయి .ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 473 చేరింది 

మరింత సమాచారం తెలుసుకోండి: