జపాన్ ప్రధాని షింజో అబే స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంతక మునుపు ఈ ఎమర్జెన్సీరాజధాని టోక్యో మరియు ఇతర ఆరు ప్రిఫెక్చర్లపై మాత్రమే ఉండగా ఇప్పుడు జపాన్ మొత్తం విధిస్తున్నట్లు అబే తెలియజేశారు. కరోనావైరస్ మహమ్మారి 8,626 మందికి సోకింది మరియు జపాన్ అంతటా 178 మంది మరణించారు.  జపాన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జపాన్ ప్రధాని ప్రతి పౌరుడికి 1,00,000 యెన్ల నగదు పంపిణి చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఈ ఎమర్జెన్సీ ని ప్రకటించినట్లు తెలిపాడు. మరియు "80 శాతం సామాజిక దూరం" సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  అబే ఏప్రిల్ 7 న రాజధానిలో ఒక నెల రోజుల అత్యవసర పరిస్థితిని మరియు మరో ఆరు ప్రిఫెక్చర్లను ప్రకటించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించిన వాటికి ఎటువంటి శిక్ష అమలు చేస్తున్నారో వివరించలేదు.

 

పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఈ ఎమర్జెన్సీ ని ప్రకటించినట్లు తెలిపాడు.
ఈ అత్యవసర సమయంలో ఇంట్లోనే ఉండవలసిందిగా అయన వేడుకున్నారు. అదేవిధంగా స్కూల్స్ కి మరియు కాలేజీ లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదేసమయంలో షాప్స్,మాల్స్ ,సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు . ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అబే స్వయంగా ఇంట్లో డాన్స్ చేస్తున్న వీడియోను ఇటీవల సోషమెడీవ లో పంచుకున్నాడు, అతను ఇంట్లో డ్యాన్స్ చేయడం గురించి తాను పాట పాడే వీడియోను కూడా అప్‌లోడ్ చేసాడు మరియు ఎమర్జెన్సీ ని అందరూ పాటించవలసిందిగా అభ్యర్ధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: