దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్ట౦ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ పిల్లలను, తల్లి తండ్రులను చూడటానికి ఎందరో రోడ్డున పడ్డారు. పిల్లలతో కలిసి నడిచి వెళ్తున్నారు. దక్షినాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. 

 

బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఓడిస్సా కు చెందిన వలస కూలీలు అందరూ కూడా భారీగా రోడ్ల మీద కడుపు నింపుకోవడానికి వెళ్తున్నారు. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. యువకులు, వృద్దులు, పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా నడిచి వెళ్తున్నారు. వీరి కోసం ఆదేశ్ రవి వారి కన్నీటిని పాటగా మలిచారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: