ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై రచయిత్రి అరుంధతీ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ముస్లిం మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి న రేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని వినియోగించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ‘‘దేశం కేవలం కరోనా వైరస్‌తోనే పోరాడటం లేదు. ద్వేషపూరిత సంక్షోభంతో, ఆకలి సంక్షోభంతో కూడా బాధపడుతోంది. ప్రస్తుతం దేశంలో మారణ హోమం పరిస్థితి ఉంది’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

కరోనాను అడ్డం పెట్టుకుని మోడీ ప్రభుత్వం ముస్లింలను అణచివేస్తోందని మండిపడ్డారు. కరోనాను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం విద్యార్థులను, లాయర్లను, సంపాదకులను, మేధావులపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందులో కొందర్ని ఇప్పటికే జైలులో పెట్టారని అరుంధతీ రాయ్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా మాట్లాడుతూ... ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే కోవిడ్ - 19 ను అడ్డం పెట్టుకుని ముస్లింలను ఊచకోత కోయాలని దేశం యోచిస్తోందన్నట్లు అర్థం వచ్చేలా ఉందని, ఆమె చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం కేసు నమోదు చేయడమే కాకుండా విచారణ జరిపించాలని రాకేశ్ సిన్హా డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: