కిరాయిదారుల‌ను అద్దె కోసం వేధింపులకు గురి చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఇంటి య‌జ‌మానుల‌ను సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు.  మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల‌కు సంబంధించి అద్దె వ‌సూలు చేయొద్ద‌ని ఆదేశించారు. ఒక‌వేళ కిరాయి కోసం ఇంటి ఓన‌ర్లు ఇబ్బందులకు గురి చేస్తే... 100కు డ‌య‌ల్ చేయాల‌ని సీఎం సూచించారు. ఈ మూడు నెల‌ల కిరాయి, వ‌డ్డీ లేకుండా త‌ర్వాత వాయిదాల ద్వారా వ‌సూలు చేసుకోవాల‌ని సీఎం చెప్పారు. 

 

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటి ఓన‌ర్లు కొంత మాన‌వతా దృక్ప‌దంతో వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.  కాగా తెలంగాణ‌లో  కొన‌సాగుతున్న లాక్‌డౌన్ ను మే 7 వరకు పొడిగిస్తున్న‌ట్లు  సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.  ఓ ప‌క్క రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఈనేప‌థ్యంలో లాక్ డౌన్ ని సడలిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: