లాక్ డౌన్ గురించి తెలంగాణ సర్కార్ ఇకపై స్ట్రిక్ట్ గా అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలియజేశారు. మే 7 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. విలేకరులు ఓ సందర్భం లో డ్వాక్రా రుణాలను కట్టాలా లేక ఆపుతున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా డ్వాక్రా రుణాలను కచ్చితమగా కట్టాలని చెప్పారు. తెలంగాణ లో లాక్ డౌన్ సమయంలో ఎటువంటి సడలింపులు ఉండవు. తెలంగాణాలో పోలీస్ సిబ్బందికి పది శాతం బోనస్ ని కేసీఆర్ ప్రకటించారు .

 

అదేవిధంగా స్కూల్స్ లో ఫీజులను ఒక నెలకు మాత్రమే వసూలు చేయాలనీ ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణాలో పెళ్లిళ్లు మరియు ఫంక్షన్ లు నిర్వహించడానికి అనుమతిలేదని ఈ సందర్భంగా కెసిఆర్ తెలిపారు . అదేవిధంగా రైతుల పంటలన్నీ తెలంగాణ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. నగరాల్లో ఉన్న అన్నీఫంక్షన్ హాళ్లు కూడా ప్రభుత్వ గోదాములుగా మారనున్నాయి . ఎవరన్నా ఇళ్ల రెంట్లు అడిగితే ఇంటిఓనర్స్ కి చర్యలు తప్పవని తెలిపారు     

మరింత సమాచారం తెలుసుకోండి: