కరోనాపై పోరులో తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్న క్రమంలో ప‌లువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవ‌ల మహారాష్ట్ర, చెన్నైల‌లో ఈ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ముంబైలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. 167 మంది జర్నలిస్టుల శాం పిల్స్‌ను సేకరించి కరోనా టెస్టులు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 53 మందిలో పలు వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు, కెమెరామెన్‌లు కూడా ఉన్నారు. అయితే, జర్నలిస్టులకు కరోనా సోకిన ఘటన యావత్తు దేశాన్ని అలర్ట్ చేసింది. 

ఈ క్రమంలోనే నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత జర్నలిస్టుకు పలు సూచనలతో విజ్ఞప్తి చేశారు.
ఈమేర‌కు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 'ముంబై జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అనే వార్త కలచివేసింది. ఇది చాలా దురదృష్టకరం. కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్న ఈ తరుణంలో... మీడియా మిత్రులందరూ వారి గురించి, వారి కుటుంబాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి' అని కవిత సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: