క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసులు, వైద్య‌సిబ్బంది త‌మ ప్రాణాల‌ను తెగించి పోరాడుతున్నారు. లాక్ డౌన్ లో భాగంగా కొంద‌రు కుటుంబాల‌కు సై తం దూరంగా ఉంటూ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ప‌లు చోట్ల అధికారులు కూడా క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కుటుంబ స‌భ్యులు  మ‌రణించిన‌ప్ప‌టికీ క‌డ‌సారి చూపున‌కు కూడా నోచుకోని ప‌రిస్థితి నెల‌కొంది. 

ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సునీతా అధా పెండ్లి ఈ నెల 25న జరుగాల్సి ఉన్నది.  హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న తిలోత్తమ మెహర్‌ పెండ్లి ఈ నెల 12 జరుగాలి. కరోనా విధుల్లో పాల్గొంటున్న వీళిద్దరూ  త‌మ పెండ్లిని వాయిదా వేసుకున్నారు. దీంతో డీజీపీ సహా ప లువురు ఆ అధికారుల‌ను మెచ్చుకున్నారు. ఇక పలువురు పోలీసులు కూడా తమ నివాసాల్లో నిర్వహించాల్సిన శుభ కార్యాలను వాయిదా వేసుకున్నారు. పోలీసులు పగలు, రాత్రానక లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో పని చేస్తున్న డాక్టర్లు కూడా తమ పెళ్లిళ్లను వాయిదా వేసు కుంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: