లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలు మరియు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులను ఆదుకుంటామని పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని తెలియజేసింది. కానీ కొంత మంది గుత్తేదారులు ఆ హామీలకు తూట్లు పొడుస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో వరి లో తేమ శాతం అధికంగా ఉందనే నెపంతో ధాన్యాన్ని తిప్పి పంపే ప్రయత్నం చేశారు గుత్తేదారులు.

 

ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని  వెల్దుర్తి మండలం రైతాంగం తమను వరి లో తేమ శాతం అధికంగా ఉందనే నెపంతో వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 16 శాతం తేమ ఉంటే కుదరదని 13 శాతం తేమ ఉంటేనే  వరి తీసుకురమ్మని లేకపోతే వెనుకకు తీసుకుని వెళ్ళిపోమని అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. వెందుర్తి మండలం లో  గత నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మరియు అకాల వర్షాల కారణంగా మేము పంట నష్ట పోయామని ఈ సందర్భంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన ధరను ప్రభుత్వం కేటాయించాలని వెందుర్తి రైతాంగం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: