దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్  తెలుగు చిత్ర పరిశ్రమ లో  21 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరెక్టుగా 1999 ఏప్రిల్ 2వ తేదీన సరిగ్గా ఇదే రోజున త్రివిక్రమ్ ఓ  సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక అప్పటినుంచి త్రివిక్రమ్ తన మైమరిపించే డైలాగులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు . క్రమంగా ఎదుగుతూ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. త్రివిక్రమ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ త్రివిక్రమ్ కు  శుభాకాంక్షలు తెలిపారు. ఇంకో ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు మీ ప్రయాణం ఇలాగే సాగాలని... అందరికీ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీ బండ్ల గణేష్ అంటూ సోషల్  వేదికగా త్రివిక్రమ్ కి శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: