లాక్‌డౌన్‌ను పాటించాలని, ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక దూరం పాటించాల‌ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తుప్పటికీ  కొందరు పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న  పనుల కోసం బయటకు వెళ్లి కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మధ్యప్రదేశ్‌లో జ‌రిగింది.  హెయిర్ క‌ట్ కోసం సెలూన్‌కు వెళ్లిన ఆరుగురు యువకులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. 

 

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇండోర్‌ నుంచి స్థానికంగా ఉన్న సెలూన్‌లో హెయిర్‌ కట్‌‌ చేయించుకున్నాడు. అ నంతరం రెండు రోజుల తరువాత అతడికి తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పా జిటివ్‌ అని తేలింది.

 

అయితే అదే వారంలో మరో ఆరుగురు వ్యక్తులు అదే షాపులో కటింగ్‌ చేయించుకున్నారు. దీంతో వారందరికీ తాజాగా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. దీంతో  ఆ యువకులను క్వారెంటైన్‌కు తరలించారు.  ఆ గ్రామంలోని అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: