కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 3 తో ముగియనుంది. ఓ వైపు లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో  దేశవ్యాప్తంగా  చాలా రాష్ట్రాలు లాక్ డౌన్‌ కొనసాగింపున‌కే మొగ్గు చూపుతున్నాయి. అయితే ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న కంటే ముందే సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్‌ను మే 7 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే.  ఆ తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాక‌పోవ‌డంతోపాటు కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగించే యోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

లాక్‌డౌన్ పొడిగించాలా... వ‌ద్దా అనే అంశంపై ప్ర‌ధాని న‌రేంద్రమోడీ మ‌రి కాసేప‌ట్లో ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ ని ర్వ‌హించ‌నున్నారు. ఈక్ర‌మంలో  సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అంశంపై చ‌ర్చించారు. అయితే ఈ స‌మావేశంలో కేసీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.  ప్ర‌ధానితో వీడియో కా న్ఫ‌రెన్స్ తో దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి తెలిసిపోతుంద‌ని, ఈ స‌మావేశం త‌ర్వాత భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

 అంతేగాక‌ లాక్ డౌన్‌తోనే క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని, క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను మించిన ప‌రిష్కారం మ‌రోటి లేద‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేసిన‌ట్లు స మాచారం. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో మరి కొంతకాలం లాక్‌డౌన్ పొడిగించాలని యోచిస్తున్న‌ట్లు తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: