క‌రోనా క‌ట్ట‌డికి ఒడిశా ప్ర‌భుత్వం ప‌క‌డ్డందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా ప్ర‌ధాని మోడీ కంటే ముందే రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పొడిగించారు ముఖ్య‌మంత్రి న‌వీన్ ‌ప‌ట్నాయ‌క్.. ఈమేర‌కు ఆయ‌న మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  కరోనా వైరస్ తో మరణించిన జర్నలిస్టు కు టుంబానికి  రూ.15లక్షల ఆర్థికసాయం అందించారు. ఈమేరకు కరోనా వల్ల మరణించిన జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ సాయం చేశామని సీఎం నవీన్ పేర్కొన్నారు. 

 

కరోనా వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో జర్నలిస్టులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముంబై నగరంలో 53 మంది టీవీ జర్నలిస్టులకు కరోనా సోకిందని తేలింది. తాజాగా మరో 15 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. జర్నలిస్టులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. చెన్నైలోనూ పలువురు జర్నలిస్టులకు కరోనా సోకింది. కరోనా ప్రబలుతున్న కాలంలో సేవలందించిన 176 మంది జర్నలిస్టులకు సిక్కిం సర్కారు 31.10 లక్షల రూపాయలను సాయంగా అందించింది. జ ర్నలిస్టులకు కరోనా సోకకుండా మీడియా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సలహా ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: