నెల్లూరులో తాజాగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారే వెలుగు చూశాయి. అయితే ఢిల్లీ నుంచి మత ప్రార్ధనలకోసం నెల్లూరు జిల్లా కు వచ్చిన తొమ్మిది మంది కరోనా పాజిటివ్ గా తేలింది. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల కోసం వెళ్లి వచ్చిన వారితో ఈ తొమ్మిది మంది కలసి ప్రార్ధనలు  చేయడం మూలంగానే వారికీ కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. లాక్ డౌన్ విధించిన నాటినుండి ఆ తొమ్మిది మంది ప్రార్ధనా పరులు ఓ ప్రార్ధనా మందిరంలో ఉంటూ ప్రార్ధనలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన వైద్యులు ఆ ప్రార్ధనామందిరం లో ఉంటున్న అందరికి టెస్టులు చేయగా ఆ తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది.

IHG

 

 

అయితే వారందరిని అధికారులు క్వారంటైన్ కి తరలించారు కానీ చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడని అధికారులు నిర్ధారించారు, అయితే చనిపోయిన వ్యక్తి గత కొద్దిరోజులుగా ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నాడు. అందువలననే అతను కరోనా భారీన పడ్డట్లు అధికారులు నిర్ధారించారు. అయితే గతంలో ఓ డాక్టర్ కరోనా పాజిటివ్ కారణంగా చనిపోయాడు. వెరసి ఒకే ప్రాంతం నుండి ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో నెల్లూరు ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు...ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 87 పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 56 పాజిటివ్ కేసులు యాక్టీవ్ గా ఉన్నాయిట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: