భార‌త్‌లో కొవిడ్‌-19 విజృంభ‌న కొనసాగుతూనే ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. రాజ‌ధాని ఢిల్లీలోని 31 బెటాలియ‌న్‌లో కొత్త‌గా మ‌రో 68 మందికి వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం బెటాల‌యన్‌లో కొవిడ్‌-19 బారిప‌డిన వారి సంఖ్య 127కు చేరింది.  ఈ వైర‌స్ వ‌చ్చిన వారిలో ఇప్ప‌టికే ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు డిశ్చార్జి అయ్యార‌ని పేర్కొన్నారు. మిగిలిన వారికి చికిత్స కొన‌సాగుతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు. 


మ‌రో ప‌క్క భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి స్వైర విహారం ఆగ‌డంలేదు. దేశ ‌వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న‌ప్ప‌టికీ... పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.  దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 37, 336 కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2, 293 కేసులు న‌మోదవ్వ‌గా 71 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మొత్తం 9,950 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 26, 167 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,218 మంది క‌రోనాతో చ‌నిపోయారు.  అ యితే రికార్డు స్థాయిలో దేశంలో ఇవాళ ఒక్క రోజే అత్య‌ధిక కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: