ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మాట్లాడతారా ?... లేదా అన్న దానిపై సస్పెన్స్ కొన‌సాగుతోంది. లాక్‌డౌన్ పొడిగింపు, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై  జాతినుద్దేశించి మోడీ ప్రసంగం ఉంటుందని చెప్పినా ... ఆయన ఇవాళ మాట్లాకపోవచ్చని తెలుస్తోంది.  లాక్‌‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం ఇప్పటికే ప్ర కటన చేసింది. ఇందుకు సంబంధించి జోన్ల వారీగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈక్ర‌మంలోనే  ఈ ఉదయం 10 గంటలకు ప్ర‌ధాని మో డీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తొలుత భావించారు.

 

అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుద‌ల కాలేదు. దీంతో ప్ర‌ధాని ప్రసంగం ఉంటుందా?...లేదా?... అనే సందేహాలు మొదల య్యాయి. కరోనా విపత్తు సమయంలో పలు సార్లు ప్రజలకు మోడీ భరోసా ఇచ్చారు. కరోనాపై కలిసికట్టుగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ పొడిగింపు సమయంలో మోడీ ఇచ్చిన పిలుపునకు కూడా దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈసారి లాక్‌డౌన్ పొడిగింపును కేంద్రం ముందే ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే మోడీ ఇవాళ ఏం చెబుతారో అనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే తాజాగా ఇవాళ మోడీ ప్రసంగం ఉండకపోవచ్చని ఢిల్లీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: