ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పలువురు సినీ ప్రముఖులు , సినీ తారలు తమ ఫొటోస్ తో మరియు వీడియోస్ తో ఆకట్టుకుంటున్నారు. సన్నీ లియోన్ కూడా తమ లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఖుషి చేస్తోంది. అయితే ఆమె లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్లోతన భర్త డేనియల్ వెబర్ ను ఫ్రాంక్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది అందులో తాను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు తన వ్రేలు తెగినట్టు తెగ హంగామా చేస్తుంది. అందుకు కంగారు పడ్డ డేనియల్ వెబర్ ఏం చేయాలో తెలియక కంగారు పడిన డేనియల్ ఓ టవల్ ను తెస్తాడు .ఆ టవల్‌తో ఆమె చేతికి కట్టే ప్రయత్నం చేస్తాడు .
ఇంతలో సన్నీ లియోన్ తమ డాక్టర్ కి కాల్ చేయమని అరవడం తో డానియల్ డాక్టర్ కోసం పరుగెత్త బోతాడు వెంటనే ఆమె కెమెరాను చూపిస్తుంది .వెంటనే విషయాన్నీ తెలుసుకున్న డేనియల్ వెబర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈ సందర్భంగా సన్నీ లియోన్ మరో వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఆ వీడియోలో తన భర్త ను ఫ్రాంక్ చేయ నిశ్చయించుకొని అందుకు కావలసిన ఏర్పాట్లను ఆమె చేసుకుంటుంది .తదనుగుణంగా సందర్భాన్ని గురించి వివరిస్తూ తన వీడియోను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.