మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచింది. అంటే ఇప్పటి వరకూ మొత్తం 75 శాతం పెంచిందన్న మాట. రాష్ట్ర‌వ్యాప్తంగా నిన్న మ‌ద్యం దుకాణాల‌ను తెర‌వ‌గా... మందుబాబులు ఎగ‌బ‌డ్డారు. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. 

 

ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. ఇవాళ మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్‌ తెలిపారు. మద్యం షాపుల వద్ద  రద్దీని తగ్గించేందుకు టోకెన్‌ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు.  అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్‌గా మార్గదర్శకాలను ఉదయం 11గంటలకు జారీ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: