మొన్న విశాఖ విష వాయువు ఘటన పై ఏపీ మంత్రి కోడలి నాని ప్రెస్ మీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ..నిన్న విశాఖ పట్నంలో జరిగిన దుర్ఘటన చాల విషాదం. ఇప్పటికే ఈ ఘటన పై కమిటీ ని ఏర్పాటు చేశాము ..మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు దేశంలో ఏ  ప్రభుత్వం చేయనటువంటి ఫలాలను విశాఖ దుర్ఘటన బాధితులకు అందించారు. విష వాయువు కారణంగా హాస్పిటల్ పాలైన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు అందించింది. అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు కోటిరూపాయల నష్ట పరిహారాన్ని అందించినట్లు తెలిపారు.

 

 

అయితే ఈ సందర్భంగా మంత్రి నాని తెలుగుదేశం అధ్యక్షుడైన చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు...చంద్రబాబు ఈ విషయమై ఓ కమిటీ వేసినట్లు చెబుతున్నారు అయితే ఈ కమిటీ సభ్యులుగా ...అచ్చెన్నాయుడు, రామానాయుడు (డ్రామానాయుడు ), చినరాజప్ప (పేకాటలో జోకర్ ) లతో ఓ కమిటీ వేసింది. అయితే ఈ  ముగ్గురు సవటదద్దమ్మల తో కమిటీ వేస్తావా. అయితే జగన్ గారు ఐఏఎస్ అధికారులతో వేసిన కమిటీ మీద మీకు నమ్మకంలేదా..? కేంద్రం ఈ దుర్ఘటన పై ఓ కమిటీ వేసింది ? ఈ కమిటీ  మీద నీకు నమ్మకం లేదా ? వీటి కంటే మీది ఉత్తమమైన కమిటీనా అని అయన మీడియా ముఖంగా విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: