సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు మదర్స్ డే సందర్భంగా తమ మాతృ మూర్తులకు శుభాకాంక్షల తో పాటుగా తమ జీవితాలను తీర్చిదిద్దనందుకు గానూ ధన్యవాదాలు చెప్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, నమ్రత, మంజుల, సుదీర్ బాబు, తమన్ ఇలా ప్రతీ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెప్తున్నారు.
తాజాగా యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు తాను ఇలా ఉన్నాను అంటే కచ్చితంగా మీ ప్రోత్సాహమే అమ్మా అంటూ పోస్ట్ చేసారు. ఇంత గొప్ప తల్లిని ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరు అమ్మలకు ఇది మంచి రోజు అని, తన తల్లికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
What ever Iam today is only bcos of you mamma I thank god for given such a great mother ❤️🙏I miss you badly ma. HAPPY MOTHERS DAY TO ALL THE GREAT MOTHERS 🙏. #happymothersday #MothersDay pic.twitter.com/smrZi6VPRm
— anuprubens (@anuprubens) May 10, 2020