తమిళనాడు లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి లో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. తాజాగా అక్కడ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

రాష్ట్రంలో కొత్తగా 798 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు.  రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 8002 చేరుకున్నాయని ప్రభుత్వం పేర్కొంది. కోయంబేడు మార్కెట్ ద్వారానే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు 2,051 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనా తో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: