కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులు అన్నీ కూడా తిరిగి ప్రారంభం అయ్యాయి. మంగళవారం నుండి ఎంపిక చేసిన మార్గాల్లో 15 జతల రైళ్ళు తిరిగి సేవలను ప్రారంభించాయి. ఇందులో ప్రయాణించే ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను భారత రైల్వే శాఖ విడుదల చేసింది. ఇందులో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు, వారి స్వంత ఆహారం వాళ్ళే తీసుకుని వెళ్ళాలి. 

 

నిన్న సాయంత్రం నుంచి రైల్వే బుకింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఇక వలస కార్మికుల కోసం మే 1 నుండి మే 11 వరకు 400 కి పైగా రైళ్లను నడిపింది. రైల్వే స్టేషన్ లో బుకింగ్ లు లేవు. ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: