ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా తీవ్రత ఒక రేంజ్ లో ఉంది. అక్కడ అదుపులో ఉంది అనుకునే లోపే కరోనా తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపాని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన విఫలం అయ్యారని బిజెపి అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియనించాలి అనే డిమాండ్ వినపడింది. 

 

ఇదే సూచన ఒక న్యూస్ పోర్టల్ యజమాని చేసాడు. తన పోర్టల్ లో సిఎం ని మార్చాలి అని కథనం రాసాడు. సీఎం విజయ్ రూపానీ విఫలమైనందు వల్ల అతన్ని తొలగించి అతనిస్థానంలో కేంద్రమంత్రి మాన్సుఖ్ మాండవీయను నియమించాలని ధావల్ పటేల్ తన న్యూస్ పోర్టల్‌లో కథనం రాయగా... ఇది వైరల్ అవ్వడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: