కరోనా వైరస్ గ్రామాల్లోకి అడుగు పెడితే దాన్ని కట్టడి చేయడం అనేది భారత్ కి సాధ్యం కాదు. ఇప్పటి వరకు దాదాపుగా కరోనా వైరస్ అనేది నగరాలకు మాత్రమే పరిమితం అయింది. అందుకే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేసారు. 

 

ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ గ్రామాల్లోకి కరోనా అడుగు పెట్టకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. నేటి నుంచి ప్రతీ ఇంట్లో కూడా జ్వర పరీక్షలను నిర్వహిస్తారు అధికారులు. ఆశా వర్కర్ల సహాయం తో ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. రాష్ట్రంలోని 43,900 మంది సిబ్బందితో కార్యాచరణ మొదలు పెట్టింది. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా లక్షణాలున్నవారి వివరాలను నమోదు చేసి ఎవరికి అయినా ఉంటే వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: