ఒక వైపు వలస కూలీలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు వారిని తరలించే కార్యక్రమాలు చేస్తుంటే... ఏపీ పోలీసులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాడేపల్లి వద్ద వలస కూలీలపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. వారిపై లాఠీ చార్జ్ చేసారు పోలీసులు. నిన్న సిఎం తో సమావేశం అనంతరం సిఎస్ నీలం సహాని వారిని పలకరించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని సూచనలు చేసారు. 

 

ఆమె అలా ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలో వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అడ్డుకుని దాడి చేసారు ఏపీ పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వలస కూలీల అవసరం రాష్ట్రాలకు ఉంటుంది అని అలాంటి వారి మీద దాడి చేయడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: