దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సొంత ఊర్లకు వెళ్ళడానికి నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా బీహార్ కి చెందిన ఒక బాలిక తన తండ్రిని ఎక్కించుకుని వెయ్యి కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. మోహన్ పాస్వాన్‌ ది బీహార్ లోని దర్బంగ. తను హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం లో రిక్షా లను అద్దెకు ఇస్తాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రిక్షాలు నడపటం లేదు. 

 

ఈ నేపధ్యంలోనే రిక్షా లను తీసుకుని సొంత ఊరు వెళ్ళడానికి ఒక లారీ డ్రైవర్ ని అడిగితే అతను ఆరు వేలు అడగగా ఇవ్వలేను అని మోహన్ అన్నాడు.  ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించిన నేపధ్యంలో కుమార్తె జ్యోతీ తండ్రిని ఎక్కించుకుని వెయ్యి కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి దర్బంగా చేరుకుంది. ఆమె వయసు 13 ఏళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: