తెలంగాణాలో కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. 

 

ఇతర రాష్ట్రాల వారిని 14 రోజుల క్వారంటైన్‌ తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని ఆయన ప్రభుత్వానికి సూచనలు చేసారు. మధిర నియోజకవర్గం మహదేవపురంలో కరోనా పాజిటివ్‌ రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఈ సందర్భంగా మల్లు ఆరోపణలు చేసారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే నిత్యావసర సరుకులు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మహాదేవపురంలో వలస కూలీకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: