కరోనా వైరస్ కి మందు కనుక్కునే విషయంలో ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలు కీలక అడుగులు వేస్తున్నాయి. అయినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విద్యాలయం కరోనా వ్యాక్సిన్ కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనక అనే ఫార్మా కంపెనీతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. 

 

అన్నీ అనుకున్నట్టు జరిగితే 30 మిలియన్ డోస్ లను ఉత్పత్తి చేయాలని భావించారు. కాని వారి వారు తయారు చేసిన సిహెచ్ఏడి ఓఎక్స్ 1 ఎన్ కోవిడ్ 19 అనే వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించగా కోతుల్లో న్యుమొనియా మాత్రమే తగ్గించింది గాని కరోనాను చంపలేదు. కరోనా వైరస్ అలాగే ఉందని గుర్తించారు. మరోసారి మనుషులపై కూడా ప్రయోగించి అప్పుడు ఏం చెయ్యాలి అనేది చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: