కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ వ్యాఖ్య చేసినా సరే అది వివాదాస్పదంగానే మారుతుంది. ఆయన నోరు అదుపులో పెట్టికుని మాట్లాడకపోతే అమెరికా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చాలా మంది సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

ముందు ఆ సంస్థ మీద ఏదోక విమర్శ చేస్తూ వస్తున్న ట్రంప్ తాజాగా... కోవిడ్‌-19 విషయంలో WHO స్పందనపై నెల రోజులలోపు సరైన నివేదిక ఇవ్వకపోతే ఆ సంస్థకు ఇచ్చే నిధులను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆ సంస్థ మీద మరిన్ని చర్యలు ఉంటాయని ఆయన ఆరోపించారు. ఇక చైనా చేతిలో ఆ సంస్థ కీలు బొమ్మగా మారింది అంటూ కూడా ట్రంప్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

who