ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో సిఎం వైఎస్ జగన్ మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. షాపింగ్ మాల్స్ ని సినిమా హాల్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం. అయితే కరోనా కేసులు ఏ ఒక్కటి లేని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. 

 

వేరే జిల్లా వాళ్ళను ఆ జిల్లాలో అడుగు పెట్టనీయకుండా ఉండే విధంగా సామాజిక దూరం పాటించే విధంగా సినిమా హాల్స్ కి అనుమతి ఇవ్వాలని వంద సీట్లు ఉంటే కేవలం 70 లేదా అంతకంటే తక్కువ సీట్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆన్లైన్ టికెట్స్ మాత్రమే అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. షాపింగ్ మాల్స్ లో కూడా టోకెన్ లు ఇవ్వాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: