తెలంగాణకు కేంద్రం భారీగా నిధులను విడుదల చేసింది. రాష్ట్ర పన్నుల వాటాను ఇచ్చింది కేంద్రం. పన్నులు, సుంకాల్లో రాష్ట్రం వాటాలో భాగంగా... రూ. 982 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మే నెలలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రూ. 46,038 కోట్లు  విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 

 

15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ నిధులు విడుదల చేసింది. తెలంగాణకు ఏప్రిల్‌లో కూడా రాష్ట్ర వాటా కింద కేంద్రం నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి పై తెలంగాణా సర్కార్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: