లాక్ డౌన్ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక రంగ చర్యలను వివరించారు. ఇక ఈ సందర్భంగా ఆర్ధిక వృద్ది కోసం తాము తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. ఇక ఏప్రిల్ 1 వ తేదీ నుండి 2020-21 మధ్య కాలంలో భారత విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 

 

ఇప్పటివరకు, మే 15 వరకు, విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యుఎస్ డాలర్లని ఆయన వివరించారు.  ప్రపంచ వాణిజ్యం కూడా భారీగా పడిపోయిందని దేశంలో సిమెంట్ సహా ఉక్కు వంటి ఉత్పత్తులు ఆగిపోయాయని ఆయన వివరించారు. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఉందని దాస్ ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: