మొన్నటి వరకు హైదరాబాద్ చికెన్ మార్కెట్ కి పెద్ద ఎత్తున వెళ్ళిన జనాలు ఇప్పుడు మాత్రం భయపడుతున్నారు. చికెన్ మార్కెట్ లకు వెళ్ళాలి అంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించి వెళ్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ వాసులు అవసరం అనుకుంటే మినహా బయటకు రావడం లేదు. హైదరాబాద్ లో చికెన్ మార్కెట్ లు ఈ దెబ్బతో ఒక్కసారి గా షాక్ తిన్నాయి. 

 

ప్రజల్లో భయం ఉండటం దానికి తోడు చికెన్ ధరలు మటన్ ధరలు భారీగా ఉండటం తో చికెన్ కొనాలి అంటే చాలు చాలా వరకు భయపడుతున్నారు. డబ్బులు కూడా అయిపోవడం తో పెద్దగా షాపులకు వెళ్ళడం లేదు. ఇక హైదరాబాద్ లో చికెన్ ధర 300 మార్క్ దాటడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: