మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. అక్కడ 50 వేల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. కరోనా వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి రైళ్ళను విమానాలను వద్దని కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నా సరే కరోన మాత్రం ఆగడం లేదు. ఇక మాహారాష్ట్రలో ఇప్పుడు కరోనా పోలీసులకు కూడా భారీగా సోకుతుంది. 

 

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1785 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 87 మంది పోలీసులకు కరోనా సోకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇక పోలీసుల విషయంలో అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలను చాలానే తీసుకుంటుంది. 55 ఏళ్ళు దాటిన పోలీసులు ఎవరూ కూడా విధులకు రావొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారు. పోలీసుల్లో మరణాలు కూడా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: