ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. ఢిల్లీ -లూథియానా ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడుకి కరోనా వచ్చింది. 50 ఏళ్ళ వ్యక్తి ఢిల్లీ -లూథియానా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. అతనికి కరోనా వచ్చిందని పరీక్షల్లో వెల్లడి అయింది. ఢిల్లీకి చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సెక్యూరిటీ విభాగంలో అతను పని చేస్తున్నాడు. 

 

టికెట్ తీసుకుని లూథియానాకు విమానంలో వెళ్ళారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించామని దీంతో విమానంలోని ప్రయాణికులు, ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని 14 రోజుల పాటు హోంక్వారంటైన్ చేసామని లూథియానా సివిల్ సర్జన్ డాక్టర్ రాజేష్ బగ్గా  మీడియాకు వివరించారు. చెన్నై-కోయంబత్తూర్, ఢిల్లీ-లూథియానా విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు కరోనా సోకింది అని కాబట్టి మహారాష్ట్రకు విమాన సర్వీసులు వద్దని ఆ రాష్ట్ర సిఎం కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: