ఒక పక్క కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న తెలంగాణా ప్రజలకు ఎండలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మెదక్, ఖమ్మం, కరీం నగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా తీవ్రంగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

 

ప్రజలు అవసరం అయితే మినహా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.  ఇక వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని అధికారులు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: