ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ లో 2 బిలియన్ డాలర్ల వాటాల కొనుగోలు చేయడానికి గానూ అమెజాన్ సంస్థ చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. గత కొన్ని రోజులుగా భారత్ కి చెందిన టెలికాం సంస్థలపై అమెరికా ఐటి దిగ్గజాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే భారత్ లో పెట్టుబడి పెట్టడానికి జియో లో ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. 

 

ఇప్పుడు ఎయిర్టెల్ లో వాటాల కోసం అమెజాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఒప్పందం పూర్తి అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అమెజాన్ సుమారు 5% వాటాను ఎయిర్టెల్ నుంచి కొనుగోలు చేస్తుంది, ఎయిర్టెల్ కి భారత్ లో 300 మిలియన్ల మందికి పైగా వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే. భారత్ లో మూడో అతి పెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: