కేరళ లో కరోనా వైరస్ ఏ మాత్రం కూడా ఆగడం లేదు. ఎన్ని విధాలుగా అక్కడ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. కేసులు ప్రతీ రోజు కూడా 80 నుంచి 90 వరకు నమోదు అవుతున్నాయి. అక్కడ యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మరణాలు మాత్రం చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. 

 

ఈ రోజు రాష్ట్రంలో 3 మరణాలు మరియు 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 884 క్రియాశీల కేసులు ఉన్నాయిని ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు కొన్ని ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: