కరోనా ప్రభావం ఇంకా తగ్గక పోవడంతో ..హైదరాబాద్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నమెంట్ రద్దు చేస్తున్నట్లు క్రీడా శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రపంచ బ్యాట్మింటన్ సమాఖ్య ఇటీవల సవరించిన షెడ్యూల్ ని ప్రకారం ఆగస్టు 11 నుండి 16 వరకు సూపర్-100  ను హైదరాబాద్ లో నిర్వహించేందు కు సన్నాహాలు జరపనుండగా ..కరోనా మహమ్మారి వ్యాపిస్తూ ఉండడంతో ఈ టోర్నీని రద్దు చేశారు.  

 


ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లకు తగినంత సమయం లేకపోవడంతో.. బిడబ్ల్యు ఎఫ్  కీలకమైన టోర్నమెంట్లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ బ్యాట్మింటన్ కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ఈవెంట్‌లకు ఇంకా అనుమతివ్వలేదు.తెలంగాణలో లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతున్నది.దీంతో పాటు ప్రస్తుతం మహమ్మారి విజృంభణ ఇంకా ఎక్కువవుతున్నది. ఇలాంటి సమయంలో టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదు’ అని పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: