టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాతకు కరోనా సోకిందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. కరోనా వైరస్ సోకిన సదరు నిర్మాత ఇటీవల ముంబై వెళ్లి వచ్చారు అని ఈ సందర్భంగా ఆయనకు కరోనా సోకింది అని వార్తలు వస్తున్నాయి. ఆర్ధిక లావాదేవీల కోసం ఆయన ముంబై వెళ్ళారు అని అక్కడ ఆయన కు కరోనా వచ్చినట్టు తెలుస్తుంది. 

 

దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మీడియాలో రాలేదు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేసారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: