జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ సహా స్థానిక పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేసారు. ఈ రోజు 5 మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. దీనిపై సోబన్ పోలీసు సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ఐదుగురు ఉగ్రవాదులు రెబన్ గ్రామంలో దాక్కున్నట్లు సమాచారం అందిందన్నారు. రాత్రి, ఈ ప్రాంతాన్ని ఆర్మీ, సిఆర్పిఎఫ్ & పోలీసుల సంయుక్త బృందం చుట్టుముట్టిందని చెప్పారు. ఈ రోజు ఉదయం మేము సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్నారు. ప్రతీకార కాల్పుల్లో, ఇద్దరు కమాండర్లతో సహా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: