తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణాలో పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశం లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం  ప్రగతి భవన్ లో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన  సిఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 

 

ఇటీవల హైకోర్ట్ తెలంగాణా లో పదో తరగతి పరీక్షలను నిర్వహించవచ్చు అని అనుమతి ఇచ్చింది గాని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో వద్దు అని చెప్పింది. దీనితో అది సాధ్యం కాదని భావించిన సర్కార్ పరీక్షలను లేకుండా విద్యార్ధులను పాస్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది. దీనిపై కాసేపట్లో విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: