బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులు అందరూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు అని  బోయపాటి కూడా ఇప్పటికే చెప్పడంతో నందమూరి అభిమానుల్లో  మరింత ఆసక్తి  పెరిగిపోయింది. పూర్తిగా గుండుతో బాలక్రిష్ణ కనిపించడంతో బాలకృష్ణ లుక్ ఎలా ఉండబోతుంది అని  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

 


 ఇక ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా విడుదల చేస్తారని ఇప్పటికే ప్రకటన విడుదల కాగా ... టైటిల్ ఎలా ఉండబోతుంది బాలయ్య ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా  ఈరోజు ఇంకొన్ని గంటలు ఈ సినిమా అప్డేట్  విడుదల కాబోతుంది. నందమూరి అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: