ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళకరంగా ఉన్నాయి. కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఉన్నా ఫలితం ఉండట్లేదు. ఇక తాజాగా జిల్లా జడ్జికే కరోనా సోకింది... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లా జడ్జీకి కరోనా వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. 

 


ఖండ్వా జిల్లా జడ్జీని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు. జిల్లా జడ్జీ భార్యతో పాటుగా  పలువురు జడ్జీలను ముందు జాగ్రత్తగా  చర్యగా హోం క్వారంటైన్ చేశామని అధికారులు పేర్కొన్నారు. జడ్జికి కరోనా నేపధ్యంలో ఖండ్వా జిల్లా కోర్టును ముందుజాగ్రత్త చర్యగా అధికారులు మూసివేశారు. ఇక ఖండ్వా జిల్లా ఇన్ చార్జి జడ్జీగా బుర్హాన్ పూర్ సెషన్స్ జడ్జీని నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది.కోర్ట్ సిబ్బందికి కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: