కరోనా లక్షణాలున్న వారికి ఇంట్లో ఉంచి చికిత్స అందించాలని కేంద్రం భావించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, పీఎంకే రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ పెదవి విరిచారు. ప్రస్తుతం నగరంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులు, ప్రత్యేక వార్డులు నిండిపోయాయని... 

 

కొత్త పాజిటివ్‌ కేసులు వచ్చినవారు ఇంట్లోనే  ఉండాలి అని వైద్యులు సూచించి ఇళ్లకు పంపుతున్నట్టు వార్తలు రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నగరంలో అవసరమైన పాఠశాలలు, కళాశాలలు, కల్యాణ మండపాలను, కమ్యూనిటీ హాళ్లను గుర్తించి, అన్ని వసతుల ఏర్పాటుతో కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పాజిటివ్‌ కేసులను ఈ వార్డులలో ఉంచి వారిని తగిన చికిత్స, పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: