బాలకృష్ణ బోయపాటి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒక పండగ. బాలయ్యతో గతంలో బోయపాటి చేసిన రెండు సినిమాలు కూడా మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మాస్ కి దగ్గరయ్యే విధంగా ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. 

 

అందుకు తగిన విధంగానే టీజర్ ని విడుదల చేసారు. బాలయ్య పంచె లో కనిపించారు. తెల్ల పంచెలో మీసం తిప్పుతూ బాలయ్య కనిపించారు. ఇది మాస్ ని ఆకట్టుకునే విధంగానే ఉంది.  పక్కా మాస్ సినిమా అనేది టీజర్ తోనే దర్శకుడు చెప్పేసాడు అంటూ టీజర్ కింద అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: