ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. నేడు అది సుప్రీం లో విచారణకు రానుంది. ఏపీ స్టేట్ ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంట్ పై నేడు విచారణ జరిపే అవకాశం ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలి అని హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. 

 

దీనిని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారించనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీరియస్ గా ఉన్న ఏపీ సర్కార్ హైకోర్ట్ తీర్పుని సుప్రీం కోర్ట్ రిజర్వ్ చేస్తే మాత్రం కచ్చితంగా  కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించే అవకాశాలు ఉన్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: